News April 13, 2025
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముగిసిన కొట్టాయి ఉత్సవం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం శనివారంతో ముగిసింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు స్వామి, అమ్మవార్లకు ఈ నెల 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెద్ద కొట్టాయి ఉత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ప్రతిరోజు స్వామి, అమ్మవార్లను కోట మండపం వద్దకు తీసుకువచ్చి విశేష పూజలు జరిపారు. చివరి రోజైన శనివారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపి, పురవీధులలో స్వామి అమ్మవార్లను ఊరేగించారు.
Similar News
News April 16, 2025
వెంటనే నివేదికలు పంపండి: నాగర్‌కర్నూల్ ఎంపీ

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల నివేదికలను వెంటనే పంపాలని ఎంపీ డాక్టర్ మల్లురవి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలాల తహశీల్దార్లు మామిడి, వరి, ఇతర పంటలను నష్ట పోయిన రైతుల వివరాలను కలెక్టరేట్లో అందివ్వాలని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందని, రైతులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.
News April 16, 2025
అత్యంత ఎత్తైన బ్రిడ్జిపై వందేభారత్ రైలు.. ప్రారంభించనున్న మోదీ

వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా పేరొంది. దీనిపై ఇక వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది. న్యూఢిల్లీ నుంచి కశ్మీర్‌కు సరాసరి నడిచే వందేభారత్ రైలును ఈ నెల 19న మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కట్రా-శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణం 7 గంటలుండగా అది 3గంటలకు తగ్గనుంది. ఇది జమ్మూను కశ్మీర్‌ను అనుసంధానించే తొలి రైల్వే లైన్ కావడం విశేషం.
News April 16, 2025
భూ భారతి పైలట్ ప్రాజెక్టుగా మద్దూరు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన భూ భారతి మొదటగా పైలట్ ప్రాజెక్టుగా మన నారాయణపేట జిల్లా మద్దూరు మండలాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మద్దూరు మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో కలిపి మొత్తం 30,621 ఎకరాల పొలం ఉండగా.. అందులో 30,473 ఎకరాలు వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములు ఉన్నాయి. మండలంలో ఈనెల 17 నుంచి నెలాఖరు వరకు అధికారులు గ్రామసభలు నిర్వహించనున్నారు.