News April 13, 2025
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముగిసిన కొట్టాయి ఉత్సవం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం శనివారంతో ముగిసింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు స్వామి, అమ్మవార్లకు ఈ నెల 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెద్ద కొట్టాయి ఉత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ప్రతిరోజు స్వామి, అమ్మవార్లను కోట మండపం వద్దకు తీసుకువచ్చి విశేష పూజలు జరిపారు. చివరి రోజైన శనివారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపి, పురవీధులలో స్వామి అమ్మవార్లను ఊరేగించారు.
Similar News
News April 22, 2025
ADB: హెడ్ కానిస్టేబుల్ బిడ్డకి సివిల్స్‌లో 68వ ర్యాంకు

హెడ్ కానిస్టేబుల్ కొడుకు సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంక్ సాధించి జిల్లావాసుల మన్ననలు పొందారు. ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి గోవింద్‌రావు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించారు. చైతన్య మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించారు. మండలవాసి సివిల్స్ సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

గొప్ప మనసు చాటుకున్న జగ్గారెడ్డి

క్యాన్సర్ బాధితురాలికి జగ్గారెడ్డి అండగా నిలిచారు. సదాశివపేటకు చెందిన ఆమని ఇంటికి వెళ్లిన ఆయన బాధితురాలిని పరామర్శించారు. చికిత్సకు రూ.7 లక్షల అప్పులు చేశానని.. భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని ఆమని విలపించింది. ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని వాపోయింది. బాధితురాలి గాథ విని జగ్గారెడ్డి తక్షణమే రూ.10 లక్షలు అందించారు.