News March 25, 2025
శ్రీగిరిపై ఉగాది కార్యక్రమాల ఇలా..!

శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 27న మహాలక్ష్మి అలంకారం, బృంగి వాహన సేవ, 28న మహాదుర్గ అలంకారం, కైలాస వాహన సేవ, 29న మహాసరస్వతీ అలంకారం, ప్రభోత్సవం, నందివాహనసేవ వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, 30న ఉగాదిన శ్రీ రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం, పంచాంగ శ్రవణం, రథోత్సవం, 31న శ్రీ భ్రమరాంబాదేవి నిజాలంకరణ, పూర్ణాహుతి, అశ్వవాహన సేవ జరుగుతుంది.
Similar News
News November 7, 2025
DEC నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

ప్రైవేట్ టెలికం కంపెనీలు డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దాదాపు 10% వరకు పెరగవచ్చని పేర్కొన్నాయి. 5G సర్వీస్ విస్తరణ, నెట్‌వర్క్ మెయింటనెన్స్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, రెవెన్యూ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. టారిఫ్స్ పెంచితే ఉదాహరణకు రోజుకు 2GB 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.949 నుంచి రూ.999కి పెరిగే అవకాశం ఉంది.
News November 7, 2025
యువత కోసం CMEGP పథకం!

AP: యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా CM ఉపాధి కల్పన (CMEGP) పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌కి ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది. గ్రామీణ యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సేవారంగంలో రూ.2లక్షల-రూ.20 లక్షలు, తయారీ రంగంలో రూ.10 లక్షల-రూ.50 లక్షల వరకు రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని, ఈనెల 10న క్యాబినెట్‌లో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.
News November 7, 2025
జాతీయ స్థాయి క్రికెట్‌కు మద్దికేర విద్యార్థి ఎంపిక

మద్దికేరకు చెందిన కాలువ శ్రీరాములు, లక్ష్మీ కుమారుడు యువరాజు ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయన తల్లిదండ్రులు గురువారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 విభాగంలో మంచి ప్రదర్శన చూపడంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. యువరాజ్ ఇంటర్ చదువుతున్నాడు. కరస్పాండెంట్ యజ్ఞం మాధవ్, ప్రిన్సిపల్ సునీత, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


