News March 12, 2025
శ్రీగిరిపై 27 నుంచి ఉగాది మహోత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఐదు రోజులు పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఉత్సవాల ప్రారంభానికి ముందే నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
Similar News
News March 13, 2025
సిద్దిపేట: రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరీ జిల్లా ప్రజలకు తెలిపారు. బుదవారం బుధవారం జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, తహశీల్దార్, ఎంపీఓ, ఎంపీడీఓ, ఎంపీడీవో, ఔట్ యజమానులతో అందరితో నిర్వహించిన ఎల్ఆర్ఎస్-2020 పైన అవగాహన కల్పించారు.
News March 13, 2025
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

TG: ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. దీని పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు ధీటుగా దీనిని ప్రభుత్వం ఫోర్త్ సిటీగా అభివర్ణిస్తోంది.
News March 13, 2025
వెంకటాపూర్: Way2Newsకు స్పందన

“రామప్ప ప్రధాన కాలువకు బుంగ ” శీర్షికన ఈనెల 10న <<15710154 >>Way2Newsలో ప్రచురితమైన<<>> కథనానికి ములుగు జిల్లా నీటిపారుల శాఖ అధికారులు స్పందించారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ప్రధాన కాలువ ఐన ఒగరు కాలువ గండిని బుధవారం పూడ్చివేశారు. అనంతరం ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.