News March 12, 2025
శ్రీగిరిపై 27 నుంచి ఉగాది మహోత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఐదు రోజులు పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఉత్సవాల ప్రారంభానికి ముందే నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
Similar News
News April 11, 2026
WGL: క్యూఆర్ కోడ్‌తో ప్రజాభిప్రాయం

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల పనితీరుపై ప్రజలు నేరుగా అభిప్రాయం తెలియజేయడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఏర్పాటు చేసి, వాటిని స్కాన్ చేస్తే ప్రత్యేక ఫారమ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. ఫిర్యాదులపై స్పందన, పోలీసుల ప్రవర్తన వంటి అంశాలపై మంచి-చెడు అభిప్రాయాలను గోప్యంగా తెలియజేసే అవకాశం కల్పించారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరగనుంది.
News April 11, 2026
ఆదోని ఎమ్మెల్యే చుట్టూ వివాదం.. పోస్టర్లు వైరల్

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ నేత సౌదీ రావుఫ్ రూ.10 లక్షల లంచం నిజమేనని, ఈ పోస్టర్ల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాలని అందులో రాసి ఉంది. ఇదే సమయంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
News April 11, 2026
SVU: ఈ నెల 13 లాస్ట్.!

SVU పరిధిలో ఈనెల 25వ తేదీ నుంచి పీజీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజమాణిక్యం తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎమ్ఎస్ డేటాసైన్స్, ఎంఈడీ, ఎమ్ఎల్ఎస్సీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈనెల 13వ తేదీలోపు ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు.


