News August 14, 2024
శ్రీనివాసులు హత్య వైసీపీ మూకల పనే: నారా లోకేశ్
పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులును వైసీపీ నేతలే హత్య చేశారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ‘ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు. శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News September 10, 2024
గత ప్రభుత్వ మైకం నుంచి అధికారులు బయటపడాలి: ఎంపీ
కొందరు అధికారులు గత ప్రభుత్వ మైకంలోనే ఉన్నారని, వాటి నుంచి బయటపడాలని, గతం ఒక లెక్కా, ఇప్పటి నుంచి మరో లెక్క అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులందరం కలిసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.
News September 10, 2024
హజ్ యాత్రకు దరఖాస్తు గడువు పెంపు: మంత్రి
హజ్ యాత్ర కోసం ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు గడువును ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మంగళవారం తెలిపారు. దరఖాస్తులకు ఈనెల 9వ తేదీ వరకు నిర్ణయించారని, ప్రస్తుతం గడువు పొడిగించామని పేర్కొన్నారు. దరఖాస్తులన్నీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్ర హజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేసిందన్నారు.
News September 10, 2024
ఆళ్లగడ్డ విషాద ఘటన.. కన్నీళ్లు తెప్పించే విషయం
ఆళ్లగడ్డ వినాయక చవితి ఉత్సావాల్లో విషాద <<14057436>>ఘటన<<>> జరిగిన విషయం తెలిసిందే. గంగమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో అశోక్ (32) అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందారు. కాగా అశోక్ పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఏడాది క్రితం ఆయనకు వివాహం కాగా ప్రస్తుతం భార్య ఏడు నెలల గర్భిణి. భర్త అకాల మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపగా మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.