News August 26, 2024
శ్రీనివాసుల రెడ్డిని కలిసిన గండిక్షేత్రం మాజీ ఛైర్మన్

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డిని గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పాలకమండలి మాజీ ఛైర్మన్ కల్లూరు వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గండిక్షేత్రంలో జరిగే స్వామివారి శ్రావణమాసం ఉత్సవాల పత్రికను, తీర్థ ప్రసాదాలు అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు ఈశ్వరయ్య, ఎల్బీఆర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
అన్నమయ్య కాలిబాట విషయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం పిల్లి: శ్యామల

అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొమరం పులే గాని కాలిబాట విషయంలో పిఠాపురం పిల్లిలా ప్రవర్తించారని YCP రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శ్యామల తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం నడింపల్లికి చేరుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాదయాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు విధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని విమర్శించారు.
News December 6, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,740
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ. 11,721
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1780.0=
News December 6, 2025
కడప: ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలపై GST దాడులు.!

కడప జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్ కార్యాలయాలపై శుక్రవారం జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. CTO జ్ఞానానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో, CTO రాజనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కడపలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్న వస్తువులను గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. పెనాల్టీ విధించారు. ప్రొద్దుటూరులో 4 ట్రాన్స్‌పోర్ట్, 3 ట్రావెల్ కార్యాలయాలపై దాడులు జరిగాయి.


