News February 7, 2025
శ్రీరంగాపూర్: విద్యుత్ షాక్తో యువతి మృతి

శ్రీరంగాపూర్ అంబేడ్కర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మౌనిక (20) ఉదయం ఇంటి వద్ద బట్టలు ఉతుకుతూ.. తడిచేతులతో మోటార్ ప్లగ్ను తీసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో షాక్ తగిలి స్పాట్లో మరణించిదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే JLM ఉద్యోగం వచ్చిందని విధుల్లో చేరవలసి ఉందని పేర్కొన్నారు.
Similar News
News October 28, 2025
పునరావాస కేంద్రాల్లో ఆహారం, దుప్పట్లు పంపిణీ

AP: ‘మొంథా’ తుఫాను ప్రభావిత జిల్లాల్లో నిరాశ్రయులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్థానికంగా వారికి ఆశ్రయం కల్పించి ఆహారం, దుప్పట్లు పంపిణీ చేశారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధమయ్యాయి. అటు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.
News October 28, 2025
HYD: ఆన్లైన్లో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు!

GHMC పౌరులకు సేవలను సులభతరం చేసింది. ఇకపై ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు ghmc.gov.in ద్వారా ఇంటి నుంచే లభిస్తాయి. పౌరులు మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం తమ PTIN/TIN/VLTN నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తే చాలు. దరఖాస్తులకు త్వరితగతిన ఆన్లైన్ ద్వారానే అనుమతులు లభిస్తాయి.
SHARE IT
News October 28, 2025
గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్.. ఐదుగురికి అస్వస్థత

గుర్ల KGBVలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో డార్మిటరీలో పరుపులు తగలబడి పొగ వ్యాపించింది. మంటలు చెలరేగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలు చెందారు. అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని అంతా బయటకి వచ్చారు. ఈ ఘటనలో పొగ పీల్చిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే చికిత్స అందడంతో ఆరోగ్యం మెరుగుపడిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.


