News February 7, 2025
శ్రీరంగాపూర్: విద్యుత్ షాక్‌తో యువతి మృతి

శ్రీరంగాపూర్ అంబేడ్కర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మౌనిక (20) ఉదయం ఇంటి వద్ద బట్టలు ఉతుకుతూ.. తడిచేతులతో మోటార్ ప్లగ్‌ను తీసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో షాక్ తగిలి స్పాట్లో మరణించిదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే JLM ఉద్యోగం వచ్చిందని విధుల్లో చేరవలసి ఉందని పేర్కొన్నారు.
Similar News
News February 10, 2026
కాచిగూడ – తిరుపతి ప్రత్యేక రైలు

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని SCR కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12న కాచిగూడ నుంచి తిరుపతికి(07511) ఒకవైపు (వన్-వే) ప్రత్యేక రైలును నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైలులో 3ఏసీ, ఛైర్‌కార్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ స్టాప్‌లో ఉన్నాయి. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Share it
News February 10, 2026
సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఫిబ్రవరి 11న ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపల్ పరిధుల్లో పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా యజమానులు సహకరించాలని కోరారు.
News February 10, 2026
సామర్లకోటలో స్టార్ కమెడియన్

సామర్లకోటలో సోమవారం సినీ బృందం సందడి చేసింది. హాస్య నటుడు అలీ, జీవిత, ఆమె కుమార్తె పాల్గొనగా నూతన చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రధానంగా అలీపై కొన్ని హాస్య సన్నివేశాలను షూట్ చేశారు. ఈ చిత్రీకరణ మూడు రోజుల పాటు జరుగుతుందని, మరికొంతమంది ప్రముఖులు ఇందులో పాల్గొంటారని చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి. తారలను చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.


