News March 11, 2025

శ్రీరాంపూర్‌లో యువతి సూసైడ్

image

శ్రీరాంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఆర్కే6 కొత్త రోడ్ ఏరియాలోని లక్ష్మీ నగర్‌కు చెందిన మెరుగు సౌమ్య సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Similar News

News October 27, 2025

కుప్పంలో పరిశ్రమల శంకుస్థాపన వాయిదా

image

కుప్పంలో <<18107753>>7 పరిశ్రమల ఏర్పాటు<<>>కు మంగళవారం CM చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయదలిచిన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నవంబర్ రెండవ వారంలో సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.

News October 27, 2025

భారత్‌తో టెస్ట్ సిరీస్.. SA జట్టు ప్రకటన

image

వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు 15 మంది కూడిన జట్టును SA ప్రకటించింది. కెప్టెన్‌గా టెంబా బవుమా వ్యవహరించనున్నారు. మార్క్రమ్, బాష్, బ్రెవిస్, టోనీ, రికెల్టన్, స్టబ్స్, వెరైన్, హమ్జా, హార్మర్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, ముల్డర్, జాన్సన్, రబాడ ఎంపికయ్యారు. నవంబర్ 14న తొలి టెస్టు కోల్‌కతాలో, రెండోది 22న గువాహటిలో జరుగుతాయి.

News October 27, 2025

పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వండి: ఎస్పీ

image

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. సోమవారం అమలాపురం పోలీసు కార్యాలయంలో ఐదు ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, భూ తగాదాలకు సంబంధించిన వీటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు.