News April 10, 2025
శ్రీరాంపూర్: కారు నడుపుతుండగా గుండెపోటు.. మృతి

విధి నిర్వహణలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన గురువారం శ్రీరాంపూర్లో జరిగింది. ఏరియాలో ఎస్ఆర్పీ 3 గని మేనేజర్ వద్ద కాంట్రాక్టు వెహికల్ డ్రైవర్గా పనిచేస్తున్న కోటేష్ విధి నిర్వహణలో వాహనం నడుపుతుండగా గుండెపోటుతో మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 20, 2025
కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలగాలి: KMR కలెక్టర్

దీపావళి పండుగను పురస్కరించుకొని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలన్నారు.
News October 20, 2025
ప్రజలకు జిల్లా కలెక్టర్ DIWALI WISHES

జగిత్యాల జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “ప్రతి దీపం ప్రతిఒక్కరి జీవితాల్లో విజయాల కాంతిని నింపాలి. ఈ దీపావళి పండుగలో దీపాల వెలుగు చీకటిని తొలగించి, మీ జీవితంలో ఆనందం, సంతోషం, శాంతితో పాటు కొత్త ఆశలను నింపాలని కోరుకుంటున్నాను” అని ప్రజలనుద్దేశించి ఆయన హృదయపూర్వక విషెస్ చెప్పారు.
News October 20, 2025
నిజాంసాగర్కు రికార్డు వరద.. వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

ఉమ్మడి NZB జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదను నమోదు చేసింది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రాజెక్టుకు AUG 18న ప్రారంభమైన ఇన్ఫ్లో OCT 20 వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. మధ్యలో 5 రోజులు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేసినప్పటికీ, తిరిగి గేట్లు ఎత్తి నీటిని దిగువన విడుదల చేస్తున్నారు.