News May 25, 2024
శ్రీరాంపూర్: నేత్రదానంతో ఇద్దరి కళ్లలో వెలుగులు

శ్రీరాంపూర్ ఆర్కే 6 కాలనీకి చెందిన సింగరేణి మాజీ ఉద్యోగి పోతునూరి సత్యనారాయణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ క్రమంలో సదాశయ ఫౌండేషన్ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగమూర్తి ఆద్వర్యంలో సత్యనారాయణ నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. సమాజ హితం కోసం విషాదంలో కూడా మృతుని నేత్రాలను దానం చేసిన వారిని ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు.
Similar News
News February 12, 2025
ఇంద్రవెల్లి: మాజీ సర్పంచ్ మృతి

ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గూడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ (36) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. సంవత్సరం నుంచి ఆయన రక్తహీనతతో బాధపడుతున్నారు. కాగా బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News February 12, 2025
మంచిర్యాల: ఉరేసుకొని వివాహిత మృతి

మంచిర్యాలలోని వడ్డెర కాలనీలో మనుబోతుల భాగ్యరేఖ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వినీత కథనం ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భాగ్యరేఖకు వడ్డెర కాలనీకి చెందిన మనుబోతుల సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తీసుకున్న అప్పు రూ.1.50లక్షల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భాగ్యరేఖ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు.
News February 12, 2025
ADB: టెన్త్ అర్హతతో 37 ఉద్యోగాలు

ఆదిలాబాద్ డివిజన్‌లో 37 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.