News February 18, 2025

శ్రీరాంపూర్: బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి: CMD

image

సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కంపెనీ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ CMD బలరామ్ సూచించారు. సోమవారం సింగరేణి భవన్ నుంచి జీఎంలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా ఏరియాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు.. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని తెలుసుకున్నారు. రానున్న 43 రోజుల్లో మిగిలిన లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సాధించాలని ఆదేశించారు.

Similar News

News October 16, 2025

విశాఖలో ₹1,222 కోట్లతో లులు ప్రాజెక్టు

image

AP: విశాఖకు AI హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానుండడంతో ‘లులు’ తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రూ.1,222 కోట్లతో హార్బర్ పార్కు వద్ద 13.74 ఎకరాల్లో వచ్చే ఈ ప్రాజెక్టులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, ఫన్ టూర్‌ వంటివి ఉంటాయి. దీనికి ప్రభుత్వం పలు రాయితీలిస్తోంది. ఇటీవల క్యాబినెట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపినా ప్రభుత్వం సవరించిన నిబంధనలకు ఓకే చెప్పింది.

News October 16, 2025

ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై జగిత్యాల కలెక్టర్ సమీక్ష

image

ఖరీఫ్ 2025–26 సీజన్‌లో 6,66,500 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు ప్రణాళికపై కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ BS లత గురువారం రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి మిల్లు 100శాతం బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని, లారీలు వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 423 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, నాణ్యతకు లోటు ఉన్న ధాన్యాన్ని వెంటనే సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.

News October 16, 2025

‘జగిత్యాల-తిరుపతి బస్సు సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

జగిత్యాల నుంచి తిరుపతికి ప్రతిరోజూ బస్సు సర్వీస్ అందుబాటులో ఉందని, ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం కల్పన తెలిపారు. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు ప్రతి గంటకు సూపర్ లగ్జరీ బస్సులు, శంషాబాద్‌కు రాజధాని ఏసీ బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ బస్సుల్లో సీట్లను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.