News March 19, 2025

శ్రీరాంపూర్: బొగ్గు ఉత్పత్తి, రవాణా పెరగాలి: CMD

image

తెలంగాణలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్ కేంద్రాల డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాలని సంస్థ CMDబలరాం పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ జీఎంలతో సమీక్ష నిర్వహించారు. సింగరేణితో ఒప్పందం ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాలకు రోజుకు కనీసం 50రేకుల వరకు బొగ్గులు రవాణా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News October 15, 2025

త్వరలోనే సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

image

త్వరలోనే జిల్లాలో సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులు తమ పంట ధాన్యాన్ని తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవద్దని ఆమె సూచించారు. రైతులు తప్పనిసరిగా తమ పంటను ప్రభుత్వానికే అమ్మాలని తెలిపారు. పంటల అమ్మకం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.

News October 15, 2025

కళాశాలల మధ్యే పొగాకు విక్రయాలు

image

తిరుపతి బాలాజీ కాలనీ సమీపంలోని విద్యాపీఠం ఆర్చ్ వద్ద నిషేధిత సిగురెట్లు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఓ వైపు SV ఆర్ట్స్ కళాశాల వెనుక వైపు, మరో వైపు ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల, ఇంకో వైపు విద్యాపీఠం, ఎస్వీ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News October 15, 2025

ICAR-IARIలో 18 ఉద్యోగాలు..

image

ICAR-IARI(ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) 18 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో యంగ్ ప్రొఫెషనల్(15), సీనియర్ రీసెర్చ్ ఫెలో(3) ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31లోగా అప్లై చేసుకోవాలి. నవంబర్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iari.res.in/