News April 2, 2025
శ్రీరాంపూర్: రౌడీషీటర్లకు ACP హెచ్చరికలు

శ్రీరాంపూర్ సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లందరినీ జైపూర్ పోలీస్ స్టేషన్‌లో ACPవెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ACP మాట్లాడుతూ..రౌడీ షీటర్లందరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని హెచ్చరించారు. ఎటువంటి కేసుల్లోనైనా ఇన్వాల్వ్ అయితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. CI వేణుచందర్, భీమారం, జైపూర్ ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839 చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్‌తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.
News April 22, 2025
కొత్తపల్లి: గోడ కూలి వలస కూలి మృతి

గోడకూలి వలస కూలి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనీడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివనోళ్ల రాంరెడ్డి ఉపాధి నిమిత్తం హైదరాబాదులో కూలి పని చేస్తూ జీవనం సాగించేవాడు. రోజులాగే ఆదివారం పనికి వెళ్లగా పని ప్రదేశంలో గోడ కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు.
News April 22, 2025
ADB: వడదెబ్బతో ఒకరి మృతి

వడ దెబ్బతో వ్యక్తి మృతిచెందిన ఘటన నార్నూరు మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. భీంపూర్ గ్రామానికి చెందిన చవాన్ కేశవ్(60) ప్రతి రోజు వెళ్లినట్లుగా సోమవారం ఉపాధిహామీ పనికి వెళ్లి పని పూర్తిచేసుకొని తిరిగి ఇంటికొచ్చాడు. దాహంగా ఉండడంతో మంచినీరు తాగి సేద తీరుతామని మంచంపై కాసేపు పడుకుంటామని విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆయన అక్కడికే కుప్పకూలిపోయాడు. నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు కోరారు.