News July 22, 2024

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 20,023 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1068.20 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 20.518 టీఎంసీ నీరు నిల్వ ఉంది.

Similar News

News December 12, 2024

మెండోరా: ఏడాదిగా మూసి ఉన్న ATM

image

మెండోరా మండలం పోచంపాడ్ చౌరస్తాలోని SBI ATM ఏడాదిగా మూసిఉంది. 2023 SEPలో దొంగలు ATMలో చోరీ చేసి రూ.12లక్షలు ఎత్తుకెళ్లడంతో అప్పటినుంచి అది మూతపడి ఉంది. మండలం చుట్టుపక్కల ATMలు లేకపోవడంతో నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్మల్ లేదా బాల్కొండ వెళ్లాల్సి వస్తోందని, అధికారులు స్పందించి దాన్ని ఓపెన్ చేయాలని కోరారు.

News December 12, 2024

NZB: తాగుబోతు ఎఫెక్ట్.. నిలిచిన ట్రాఫిక్

image

నిజామాబాద్ నీలకంఠేశ్వర దేవాలయం సమీపంలో ఓ తాగుబోతు బుధవారం రాత్రి హల్చల్ చేశాడు. అక్కడి ఓ వైన్స్ ఎదుట రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. దీంతో నిజామాబాద్- ఆర్మూర్ ప్రధాన రూట్ లో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకు పోయింది.

News December 12, 2024

బోధన్‌లో విద్యుత్తు అధికారుల పొలంబాట

image

బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లి ప్రాంతంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ట్రాన్స్‌కో డీఈ ముక్త్యార్ హైమద్ మాట్లాడుతూ.. రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు తమ బోరు మోటార్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏడీఈ నాగేష్ కుమార్, ఏఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.