News April 5, 2025
శ్రీరామనవమికి నిర్లక్ష్యం వహించొద్దు: భద్రాద్రి కలెక్టర్

సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవానికి వివిధ సెక్టార్లలో విధులు నిర్వహించే అధికారులు 6వ తేదీ ఉదయం 6 గంటలకు తమ విధులలో అందరూ హాజరు కావాలని నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమయంలో కలెక్టర్ మాట్లాడుతూ.. సిబ్బంది, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Similar News
News November 28, 2025
దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. అతి భారీ వర్షాలు!

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాను గంటకు 7KM వేగంతో పయనిస్తున్నట్లు IMD వెల్లడించింది. ప్రస్తుతం శ్రీలంకకు 50KM, చెన్నైకి 540KM, పుదుచ్చేరికి 440KM దూరంలో ఉన్నట్లు తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ NOV 30న తమిళనాడు-దక్షిణ కోస్తా తీరానికి చేరే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రేపటి నుంచి DEC 4 వరకు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.
News November 28, 2025
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News November 28, 2025
సెబీలో పెరిగిన పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

సెబీలో 110పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా 135కు పెంచారు. జనరల్ విభాగంలో 56 పోస్టులకుగాను 77కు, రీసెర్చ్ విభాగంలో 4 ఉండగా.. 8కి పెంచారు. మిగిలిన విభాగాల్లో పోస్టులను పెంచలేదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ / PG డిప్లొమా, LLB, BE/B.Tech, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: sebi.gov.in


