News April 6, 2025
శ్రీరామనవమికి సంగారెడ్డి జిల్లాలో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో శ్రీరామ నవమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. మత సంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మతసామరస్యం నెలకొంటుందని తెలిపారు. జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలలో శ్రీరామనవమి ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.
Similar News
News January 10, 2026
అమరావతిపై YCP వైఖరి పూర్తిగా మారినట్లేనా?

AP: అమరావతిపై <<18817916>>సజ్జల<<>> వ్యాఖ్యలతో రాజధానిపై ఆ పార్టీ వైఖరి పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ <<18799615>>కామెంట్ల<<>> తర్వాత YCP అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారనే టాక్ విన్పించింది. 3 రాజధానుల అంశం గత ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు పలుమార్లు ఆ పార్టీ నేతలు అన్నారు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందుకే జగన్ వ్యాఖ్యలపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై మీరేమంటారు.
News January 10, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
News January 10, 2026
మేడారం జాతరలో 3199మంది వైద్య సిబ్బంది

ఈ సారి మేడారం జాతరలో 3199 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వీరిని నియమించుకుంటారు. మొత్తం 544 మంది వైద్యులలో 72మంది స్పెషలిస్టులు, 42మంది మహిళా డాక్టర్లు ఉంటారు. మరో 2150మంది పారామెడికల్ సిబ్బంది పని చేస్తారు. మేడారంలో 50పడకల ప్రధాన ఆస్పత్రితో పాటు 6 పడకలతో 30క్యాంపులు ఏర్పాటు చేస్తారు.


