News April 6, 2025

శ్రీరామనవమికి సంగారెడ్డి జిల్లాలో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో శ్రీరామ నవమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. మత సంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మతసామరస్యం నెలకొంటుందని తెలిపారు. జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలలో శ్రీరామనవమి ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.

Similar News

News April 23, 2025

కొత్త పెన్షన్లు.. అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం

image

TG: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రెడీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వీటిపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 43 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 ఇస్తున్నారు.

News April 23, 2025

2PM: HYDలో 78.57% పోలింగ్

image

HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది. సాయంత్రం 4 గంటలను పోలింగ్ ముగియనుంది.

News April 23, 2025

పార్వతీపురం మన్యం జిల్లా టాపర్లు వీరే

image

➤ సాలూరు బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన పెద్దపూడి తేజస్విని 592 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది
➤ పార్వతీపురం టీఆర్ఎం స్కూలు విద్యార్థి చక్రిశ, కురుపాం zphs విద్యార్థిని ఎం.రిషిత 591 మార్కులతో సెకండ్ ప్లేస్ సాధించారు 
➤ భామిని ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన జగదీశ్ 590 మార్కులతో మూడో స్థానంలో నిలిచాడు. 

error: Content is protected !!