News March 15, 2026
శ్రీరామనవమి నాడు ‘భద్రగిరి గిరిజన మార్ట్’ ప్రారంభం

గిరిజన మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా శ్రీరామనవమి నాడు భద్రగిరి మార్ట్ ప్రారంభించనున్నట్లు APO డేవిడ్ రాజ్ వెల్లడించారు. ఆదివారం స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ.. మార్ట్ విజయవంతానికి వ్యాపారులు తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజలకు నిత్యం అవసరమయ్యే సరుకుల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తూనే, నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచుతామన్నారు.
Similar News
News April 13, 2026
భద్రాద్రి కలెక్టర్‌తో ఎంపీ రేణుక భేటీ

ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భద్రాచలం వచ్చిన ఆమెను కలెక్టర్ అంకిత్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వీరబాబు, కొత్తగూడెం మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కమిషనర్ సుజాత కార్పొరేటర్లు స్వాగతం పలికారు. అనంతరం భద్రాద్రి జిల్లా సమస్యలు, సమగ్ర అభివృద్ధి పై చర్చించారు.
News April 13, 2026
పబ్లిక్ గార్డెన్‌లో రేపు అంబేడ్కర్ సినిమా ప్రదర్శన

నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో రేపు (మంగళవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బయోపిక్ ప్రదర్శించనున్నారు. తెలుగు లలితకళా తోరణంలో ఈ ప్రదర్శన ఉంటుంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రదర్శన ఉంటుందని సాంస్కతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News April 13, 2026
భారత్ చేరుకున్న ఇరాన్ నౌకలు

పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ చమురు నౌకలు రెండు భారత్ చేరుకున్నాయి. గుజరాత్‌లోని సిక్కా పోర్టులో ఇవి లంగరేసినట్లు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. దీంతో ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు వచ్చినట్లయింది. సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో మార్చి రెండో వారంలో ఈ రెండు నౌకలు ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి.


