News April 5, 2025
శ్రీరామనవమి వేడకలు.. తిరుపతి SP కీలక ఆదేశాలు

తిరుపతి జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. శ్రీరాముడు ధర్మానికి, న్యాయానికి ప్రతీక అని అని.. ఈ పండుగ మనకు ధర్మాన్ని ఆచరించాలని సూచిస్తుందన్నారు. ధర్మాన్ని కాపాడాలంటూ శ్రీరామచంద్రుడు చూపిన మార్గం వైపు ప్రజలు నడవాలన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో ఎక్కడ డీజేలు పెట్టవద్దని ఆయన హెచ్చరించారు.
Similar News
News April 9, 2025
ADB: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
News April 9, 2025
అమెరికాతో ఒప్పందానికి సిద్ధమే కానీ..: ఇరాన్

అణు ఒప్పందం విషయంలో ఇరాన్ కొంత మెత్తబడింది. అమెరికా వైఖరి మార్చుకుని తమని గౌరవిస్తే చర్చలకు సిద్ధమేనని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. ‘ప్రత్యక్ష చర్చలు మాకు ఇష్టం లేదు. ఈ చర్చలు పరోక్షంగా జరగాలి. USకు నిజంగా మాతో మాట్లాడాలన్న చిత్తశుద్ధి ఉంటే ఒప్పందానికి రావడం కష్టమేం కాదు. సైనికపరంగా ఎటువంటి పరిష్కారాన్ని మేం ఆమోదించం. బంతి ఇప్పుడు అమెరికా కోర్టులోనే ఉంది’ అని స్పష్టం చేశారు.
News April 9, 2025
వరంగల్: నేలకొరిగిన మునగ చెట్లు

దుగ్గొండి మండలం శివాజీ నగర్ గ్రామంలో బుస్సారి రామారావు అనే రైతు రెండెకరాల్లో మునగ తోట సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులు రావడంతో మునగ చెట్లు నేలకొరిగాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు కోరుకుతున్నాడు. దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, మిరప తోటలు ఈదురు గాలులతో నేలకొరిగాయి. దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.