News March 23, 2025

శ్రీరామనవమి వేడుకలకు ఆహ్వానం

image

శ్రీరామ నవమి వేడుకలకు రావాలని శనివారం రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావులకు భద్రాచలం ఈఓ రమాదేవి, వేద పండితుల ఆహ్వానం పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పాల్గొన్నారు. అసెంబ్లీ లాబీలో కలిసి ఆహ్వానం అందజేశారు.

Similar News

News October 23, 2025

PM ఆవాస్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

image

PM ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలోని 319 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 22 నుంచి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించాలన్నారు. అర్హులుగా ఉండి, సొంత స్థలం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

News October 23, 2025

కృష్ణా: భారీ వర్షాలు.. విద్యుత్ అధికారుల హెచ్చరిక

image

భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో జిల్లా విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తడిచిన విద్యుత్ స్తంభాలను, లైన్‌కు తగిలిన చెట్లను ముట్టుకోవద్దని చెప్పారు. విద్యుత్ లైన్ దెబ్బతిన్నట్లు గమనిస్తే వెంటనే సిబ్బంది, లేదా 1912 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

News October 23, 2025

మేడ్చల్-మల్కాజిగిరిలో 5 వేలకు చేరువలో వైన్స్ టెండర్లు

image

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 88 మద్యం దుకాణాలకు మొత్తం 4,910 దరఖాస్తులు అందినట్లు DPEO నవీన్ తెలిపారు. దరఖాస్తుల గడువును ఎక్సైజ్ శాఖ 18 నుంచి 23వ తేదీ వరకు పొడిగించిన తర్వాత కేవలం 30 దరఖాస్తులు మాత్రమే అందినట్లు తెలిపారు. ఈరోజు చివరి రోజు కావడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సా.5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనున్నట్లు తెలిపారు. ఈనెల 27వ తేదీన డ్రా నిర్వహించనున్నారు.