News April 5, 2025

శ్రీరామనవమి వేడుకలు.. చిత్తూరు SP సూచనలు 

image

చిత్తూరు జిల్లా ప్రజలకు SP మణికంఠ చందోలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమిని చైత్రశుద్ధ నవమి రోజున ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. శ్రీరాముడు ధర్మానికి, న్యాయానికి ప్రతీక అని ఈ పండుగ మనకు ధర్మాన్ని ఆచరించాలనే సందేశం ఇస్తుందని SP అన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు వేడుకలు చేసుకోవాలని ఆయన సూచించారు. 

Similar News

News April 9, 2025

చిత్తూరు: బాలికకు గర్భం.. కేసు నమోదు

image

చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. SI నాగేశ్వరరావు వివరాల మేరకు.. 15 ఏళ్ల బాలికను ఆమినిగుంట పంచాయతీకి చెందిన నాగేంద్ర ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భణిని చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో, SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

News April 9, 2025

చిత్తూరు: యువతి ప్రేమ నిరాకరించిందని..!

image

ఓ యువకుడు తన వాహనానికే నిప్పు పెట్టుకున్న ఘటన పుంగనూరు మండలంలో జరిగింది. గిరి అనే యువకుడు పూజాగానిపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తన ప్రేమను నిరాకరించిదన్న కోపంతో గిరి ఆమె ఇంటి ముందు మంగళవారం తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అడ్డుకున్న స్థానికులతో వాగ్వాదానికి దిగాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News April 9, 2025

జ్యూట్ బ్యాగులను వినియోగించుకుందాం: ఎంపీ 

image

జ్యూట్ బ్యాగులను వినియోగించి, పర్యావరణాన్ని పరి రక్షించుకుందామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీ కార్యాలయంలో జ్యూట్ బ్యాగులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ కట్టుబడి ఉండాలని ఎంపీ సూచించారు.

error: Content is protected !!