News April 5, 2025

శ్రీరామనవమి వేళ.. వరంగల్ ట్రైసీటీలో పోలీసుల నజర్

image

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శ్రీరామ మందిరాలతోపాటు, వాడల్లో ప్రజలు జరుపుకునే శ్రీరాముని కళ్యాణ వేడుకలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. రామ మందిరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శోభాయాత్ర సమయంలో పోలీసులు తగు బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News April 7, 2025

సిరిసిల్ల: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

image

ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది.

News April 7, 2025

విశాఖ: వైసీపీకి చొక్కాకుల రాజీనామా

image

విశాఖలో YCPకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చొక్కాకుల వెంకటరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, పెట్రో కెమికల్ అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014లో ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. భార్య కూడా వైసీపీలో పదవులు పొందారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు.

News April 7, 2025

జహీరాబాద్: యువకుడి దారుణ హత్య

image

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనశ్రీ గ్రామంలో అబ్బాస్(25)ను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల వివరాలు.. అదే గ్రామానికి చెందిన వారే ఈ హత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. చిరాగ్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!