News April 5, 2025
శ్రీరామ నవమి వేడుకకు అయోధ్య సిద్ధం

శ్రీ రామ నవమి వేడుకకు అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఎండల నేపథ్యంలో ప్రత్యేక వసతి కేంద్రాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలలో వాహనాలను పంపిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ LED స్ర్కీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 9, 2025
GT భారీ స్కోర్.. RR టార్గెట్ ఎంతంటే?

IPL: రాజస్థాన్ రాయల్స్తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 217-6 స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించగా, బట్లర్ (36), షారుఖ్ (36) ఫర్వాలేదనిపించారు. RR బౌలర్లలో తీక్షణ, తుషార్ దేశ్పాండే చెరో 2 వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో రాజస్థాన్ గెలవాలంటే 20 ఓవర్లలో 218 రన్స్ చేయాలి.
News April 9, 2025
పిడుగులు పడి 13మంది మృతి

బిహార్లో పిడుగుపాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో 13మంది మృతిచెందారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మధుబనీ జిల్లాలో పొలంలో పనిచేస్తున్న వారిపై పిడుగుపడటంతో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. మెుత్తంగా 4 జిల్లాల్లో పిడుగుల కారణంగా 13మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
News April 9, 2025
మోదీని విమర్శించే స్థాయి నీకుందా రేవంత్: TBJP

TG: ప్రధాని మోదీపై CM రేవంత్ చేసిన విమర్శలకు తెలంగాణ BJP కౌంటరిచ్చింది. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన నీకు మోదీని విమర్శించే స్థాయి ఉందా? రాహుల్ గాంధీకి ఊడిగం చేసే నువ్వా మాట్లాడేది? అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి పేద ప్రజల కడుపు కొడుతూ పబ్బం గడుపుకునే నువ్వా మాట్లాడేది? విదేశీ గడ్డపైనా ప్రశంసలు పొందిన మోదీని విమర్శించావంటే నీ స్థాయి ఏంటో, నీ కురచ బుద్ధి ఎలాంటిదో అర్థమవుతుంది’ అని ట్వీట్ చేసింది.