News November 14, 2024
శ్రీరెడ్డిపై అనంతపురంలో పోలీసులకు ఫిర్యాదు
నటి శ్రీరెడ్డిపై తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. సీఐ సాయినాథ్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా శ్రీరెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
Similar News
News December 6, 2024
తాడిపత్రిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
తాడిపత్రి రైల్వే స్టేషన్ పరిధిలోని కోమలి-జూటూరు మధ్య షేక్ బాషా రైలు కిందపడి గురువారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంతకల్లుకు చెందిన షేక్ బాషా పుదిచ్చేరి నుంచి కాచిగూడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తాడిపత్రి రైల్వే ఎస్ఐ నాగప్ప చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 6, 2024
సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి: కలెక్టర్ చేతన్
గ్రామ సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ నమోదును తప్పనిసరిగా చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ పనులపై సమీక్ష నిర్వహించారు. పనుల్లో వెనుకబడిన ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.
News December 6, 2024
శ్రీ సత్యసాయి: ‘నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకోండి’
నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌ను ఆదేశించారు. గురువారం పౌర సరఫరాల శాఖ అంశంపై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని సూచించారు. అధికారులు, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ వల్ల రైతుల ఇబ్బంది పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.