News February 19, 2025
శ్రీలత రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే!

BJP జిల్లా పార్టీ పగ్గాలు తొలిసారి మహిళ చేతిలోకి వెళ్లాయి. జిల్లా అధ్యక్షురాలిగా నేరేడుచెర్లకు చెందిన శ్రీలతరెడ్డిని అధిష్ఠానం నియమించింది. 2019లో BRSతో రాజకీయప్రస్థానం మొదలుపెట్టిన ఈమె నేరేడుచెర్ల మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2023లో MP ఈటల సమక్షంలో BJPలో చేరి HNR నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ BJPలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
Similar News
News March 28, 2025
గద్వాల: ‘ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలి’

యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర కార్యదర్శి లోకేశ్ కుమార్ పేర్కొన్నారు. సర్ఫ్ సీఈవో దివ్యతో కలిసి గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 33 శాతం ఉన్న కొనుగోలు కేంద్రాల సంఖ్యను 50 శాతానికి పెంచేలా ప్రతిపాదనలు తయారు చేసుకోవాలన్నారు. గద్వాల కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు.
News March 28, 2025
తండ్రి మరణంలోనూ కుమార్తెకు ‘పరీక్ష’!

తండ్రి మరణంతో దుఃఖాన్ని దిగమింగుకుని పది పరీక్షలకు హాజరైంది ఓ విద్యార్థిని. ఉరవకొండ మం. రాకెట్లకు చెందిన రఘు(48) కూడేరు మండలం గొట్కూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రక్షిత పది పరీక్షలు రాస్తోంది. తన పెద్ద కుమార్తెను కాలేజీలో విడిచిపెట్టి తిరిగి బైక్‌పై వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. తండ్రి లేడన్న బాధను దిగమింగుకుని చిన్నకూతురు పరీక్ష రాసింది.
News March 28, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో CMRFచెక్కులు పంపిణీ ∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత దయానంద్ పర్యటన