News February 26, 2026

శ్రీవారికి నగదే కాదు ‘ముడుపు పత్రాలు’ సమర్పించవచ్చు!

image

AP: తిరుమలలో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు కొత్త విధానాన్ని TTD అమలు చేయనుంది. త్వరలో ‘శ్రీవారి ముడుపు పత్రం’ పేరుతో ప్రత్యేక పత్రాలను జారీ చేయనుంది. ₹100 నుంచి ₹లక్ష వరకు UPI, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసి హుండీలో సమర్పించవచ్చు. క్యాష్‌లెస్ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి జరిగే TTD బోర్డు మీటింగ్‌లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్‌లో HYD-1కు 11TH ర్యాంక్

image

ఇంటర్ సెకండియర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. HYD- 1లో రెగ్యులర్ విద్యార్థులు 28,930 మంది పరీక్షలు రాయగా 21,529 మంది పాసై 74.42 శాతంతో స్టేట్‌లోనే 11TH ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ వొకేషనల్‌లో 1,298 మందికి 1,007 మంది పాసై 77.58%తో 9వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 5,194 మందికి 1,302 మంది పాసై 25.07%తో 33వ స్థానంలో నిలిచింది. వొకేషనల్‌ ప్రైవేట్‌లో 91 మందికి 44 మంది పాసై 48.35%తో 22వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

అమరావతికి ₹3,165 కోట్లు ఇచ్చాం: WB

image

AP: అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ₹3,165 కోట్లు విడుదల చేసినట్లు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. పనుల పురోగతిని బట్టి దశలవారీగా మిగిలిన నిధులను విడుదల చేస్తామని తెలిపారు. 6ఏళ్ల గ్రేస్ పీరియడ్, 29 ఏళ్ల మెచ్యూరిటీతో లోన్ మంజూరు చేసినట్లు చెప్పారు. 2031 జూన్ 15 నుంచి రీపేమెంట్ గడువు స్టార్ట్ అవుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారేలా నగరానికి సహకరిస్తామని తెలిపారు.

News April 12, 2026

ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

image

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It