News January 11, 2026
శ్రీవారిని గురువారం నాడు దర్శించుకుంటే..?

శ్రీవారిని ప్రతి గురువారం నిజరూపంలో దర్శించుకోవచ్చు. వారంలో 6 రోజులు సర్వాభరణ భూషితుడై ఉండే స్వామి గురువారం మాత్రం నిరాడంబరంగా దర్శనమిస్తారు. నొసటన ఉండే పచ్చకర్పూరపు నామాన్ని తగ్గించడం వల్ల భక్తులు స్వామివారి నేత్రాలను నేరుగా చూసే భాగ్యం కలుగుతుంది. అందుకే దీన్ని నేత్ర దర్శనమని అంటారు. కేవలం పట్టుధోవతి, తలపాగా ధరించి దేదీప్యమానంగా వెలిగే స్వామివారి ఈ నిజరూపం పరమానందాన్ని, శాంతిని చేకూరుస్తుంది.
Similar News
News January 24, 2026
Grok సేవలకు అంతరాయం

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ Grok సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రోక్ యాప్, ట్విటర్‌లోలోనూ అందుబాటులో లేదు. ‘హై డిమాండ్ కారణంగా గ్రోక్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని సరిచేసేందుకు మేము కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని xAI సంస్థ తెలిపింది.
News January 24, 2026
అరుణోదయ స్నానం ఆచరిస్తూ పఠించాల్సిన మంత్రం ఇదే..

“యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి’’
తెలిసీ, తెలియక చేసిన పాపాలు, తప్పుల వల్ల వచ్చిన రోగాలు, శోకాలన్నీ ఈ సప్తమి స్నానంతో నశించుగాక! అని దీనర్ధం.
News January 24, 2026
గుంటూరు జిల్లాలో 45 పోస్టులకు నోటిఫికేషన్

AP: గుంటూరు జిల్లా వైద్యారోగ్యశాఖ 45 <


