News January 17, 2025
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్ నెల కోటా విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్ నెల కోటాను జనవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.
Similar News
News February 10, 2025
చిత్తూరు కలెక్టరేట్‌లో నేడు గ్రీవెన్స్ డే

చిత్తూరు కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం1 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
News February 9, 2025
బంగారుపాల్యం: ప్రాణం తీసిన ఈత సరదా

ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన బంగారుపాల్యం మండలం మొగిలిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఫిబ్రవరి 7న సెల్వరాజ్ స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోయిన చెరువులో దిగడంతో గల్లంతయ్యాడు. రెండు రోజులు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అగ్నిమాపక దళం తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని చెరువు నుంచి ఆదివారం వెలికి తీశారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 9, 2025
చిత్తూరు: మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు

చిత్తూరు జిల్లాలో కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన పది మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. తొలుత దరఖాస్తులకు ఐదో తేదీ వరకే గడువు విధించడంతో 13 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో గడువును 8వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. దరఖాస్తుదారులకు సోమవారం లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.