News October 7, 2024
శ్రీవారి గరుడసేవకు విస్తృతమైన ఏర్పాట్లు : టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుతో కలిసి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
Similar News
News January 9, 2026
కుప్పం: పగటిపూటే వ్యవసాయ కరెంట్.!

కుప్పం డివిజన్లోని 26 సబ్స్టేషన్ల పరిధిలో 141 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం 570 ఎకరాలకుగాను 542.16 ఎకరాల భూ సేకరణ పూర్తైంది. వీటి ద్వారా 130 ఫీడర్లకు అనుసంధానమైన 32,106 వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందనుంది.
News January 9, 2026
చిత్తూరులో గణతంత్ర వేడుకలపై సమీక్ష

గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్ఓ మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్లోని డీఆర్ఓ కార్యాలయంలో జనవరి 26వ తేదీన నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ వేడుకలను పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 7 గం.లకు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇన్ఛార్జ్గా చిత్తూరు ఆర్డీవో ఉంటారన్నారు.
News January 9, 2026
చిత్తూరు : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇస్తున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. పాఠశాల పని దినాలు సర్దుబాటులో భాగంగా 10న రెండో శనివారం పాఠశాలలు పనిచేయాల్సి ఉన్నా, సెలవు దినంగా ప్రకటించామన్నారు. ఈ దినాన్ని మరో రోజున పనిదినంగా పరిగణించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రత్యేక తరగతులకు సైతం బ్రేక్ ఇచ్చారు.


