News July 17, 2024
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారిని మంగళవారం 71,409 మంది దర్శించుకున్నారు. 26,128 మంది తలనీలాలు సమర్పించారు. రూ.4.15 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారని టీటీడీ అధికారులు బుధవారం తెలిపారు.
Similar News
News December 10, 2024
ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16న ప్రారంభం కానుంది. ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు.
News December 10, 2024
21 నుంచి SVU పరీక్షల ప్రారంభం
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 2వ తేదీ వరకు కొనసాగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News December 10, 2024
తిరుపతి: యువతి మృతి.. అసలేం జరిగింది?
చంద్రగిరి(M) ముంగిలిపట్టు వద్ద నిన్న <<14835672>>చనిపోయిన <<>>యువతి పాకాల(M) వడ్డేపల్లికి చెందిన శ్రావణి(23)గా గుర్తించారు. తిరుపతిలో పనిచేసే ఆమెకు పూతలపట్టు(M) కమ్మవాండ్లపల్లె కార్తీక్‌తో పరిచయం ఉంది. ఇద్దరూ బైకుపై తిరుపతి నుంచి ముంగిలిపట్టుకు వచ్చారు. సాయంత్రం అమ్మాయి ఏడుస్తుండగా స్థానికులు గమనించారు. ఆ తర్వాత ఆమెను కార్తీక్ ఏమైనా చేశాడా? రోడ్డు దాటుతుంటే వాహనం ఢీకొని చనిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది.