News May 18, 2024
శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్ట్ నెల కోటాను మే 18న ఉ.10గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 18 నుంచి 20వ తేదీ ఉ.10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. 22న ఆర్జిత సేవా, 23న అంగప్రదక్షిణం టోకెన్లు, 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Similar News
News September 13, 2025
చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ

చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్లలో పని చేస్తున్న తుషార్ డూడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
News September 13, 2025
బార్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. 17 లాస్ట్

చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 6 బార్లకు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.18వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని DRDA సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరుగుతుందన్నారు.
News September 12, 2025
నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వుకాలు నిషేధం: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా నదీ ప్రవాహక ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు నిషేధమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఆయన ఎస్పీ మణికంఠ చందోలు, జేసీలతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆదాయం కోసం కాకుండా ప్రజలకు సులభంగా ఇసుక అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో 45,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నట్లు ఆయన వివరించారు.