News May 18, 2024

శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్ట్ నెల కోటాను మే 18న ఉ.10గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 18 నుంచి 20వ తేదీ ఉ.10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 22న ఆర్జిత సేవా, 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు, 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News December 9, 2024

తిరుపతిలో వ్యభిచారం గుట్టురట్టు

image

తిరుపతి రైల్వే కాలనీలో వ్యభిచారం కలకలం రేపింది. ఎర్రమిట్టకు చెందిన ఓ మహిళ రైల్వేకాలనీలో ఇంటిని బాడుగకు తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ వ్యభిచారం నడుపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఓటేరుకు చెందిన ఓ వ్యక్తితో పాటు అమ్మాయిలను పట్టుకున్నారు. ఈ మేరకు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు.

News December 8, 2024

తిరుపతి, చిత్తూరుకు రైట్ రైట్ అంటున్న బడా హీరోలు

image

తెలుగు సినిమా ఉ.చిత్తూరు జిల్లాకు వరుసగా హాయ్ చెబుతోంది. చిత్తూరు నేపథ్యంలో ‘పుష్ప’ ఎంతటి హవా చూపించిందో తెలిసిందే. అంతకన్నాముందు నివేథా థామస్ 35 ఇది చిన్న కథకాదు, శర్వానంద్ శ్రీకారం, కిరణ్ వినరో భాగ్యం విష్ణు కథ సినిమాల షూటింగ్ ఇక్కడే జరిగింది. శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబోలో వస్తున్న ‘కుబేర’ సైతం తిరుపతిలో షూటింగ్ జరిగింది. తమ యాస, భాష సరిహద్దులు దాటుతుందంటూ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

News December 7, 2024

అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్

image

ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి విదితమే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మార్పులతో కూడిన పథకం అమలు చేయనుంది టీటీడీ.