News February 26, 2025
శ్రీవారి భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : BR నాయుడు

శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇటీవల ఛైర్మన్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి వాట్సాప్ ద్వారా చేసిన దానిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్‌గా గుర్తించారు. శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఊపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News February 26, 2026
మోదీ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత ఇరాన్‌పై అమెరికా దాడి: ఒవైసీ

మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గాజా మారణహోమానికి నెతన్యాహునే కారణమని ఆరోపించారు. ఆయన్ని ‘యుద్ధ నేరస్థుడి’గా అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని మోదీ కౌగిలించుకోవడమేంటి అని ప్రశ్నించారు. ఇది పాలస్తీనాకు భారత్ అందించే చిరకాల మద్దతును దెబ్బతీయడమేనని విమర్శించారు.
News February 26, 2026
ASF: విద్యుత్ ఫిర్యాదులు వాట్సాప్‌లోనే

ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల సౌకర్యం కోసం వాట్సాప్ చాట్ బాట్ ప్రారంభించిందని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడే తెలిపారు. 7901628348కు వాట్స్ఆప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది. ట్రాక్, ఏజెంట్‌తో చాట్ చేయవచ్చు. సర్వీస్ నంబర్‌తో ఫిర్యాదు ID వెంటనే వస్తుంది. పరిష్కారం తర్వాత SMS/IVRS ద్వారా సమాచారం అందుతుందన్నారు.
News February 26, 2026
కట్టకొక కంకి లేతైనా పుట్టికి ఏదుంతరుగు

పంట పండే సమయంలో ప్రతి మొక్కకు (కట్టకు) ఉండే కంకి గట్టిపడకుండా, పాలు పోసుకునే దశలో లేదా లేతగా ఉంటే, గింజ బరువు తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పంటను అమ్మితే ఆశించిన బరువు రాకపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అంటే పంట కేవలం సంఖ్యలో (కంకులు) ఎక్కువగా ఉంటే సరిపోదు, గింజ ముదిరి గట్టిగా ఉంటేనే రైతుకు సరైన బరువు, తద్వారా లాభం వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.


