News February 26, 2025
శ్రీవారి భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : BR నాయుడు

శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇటీవల ఛైర్మన్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి వాట్సాప్ ద్వారా చేసిన దానిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్‌గా గుర్తించారు. శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఊపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News March 27, 2025
ములుగు: స్త్రీ నిధికి సిబ్బందిని నియమిస్తాం- సీతక్క

రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల స్త్రీ నిధికి త్వరలో సిబ్బందిని నియమిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాదులో జరిగిన స్త్రీనిధి 12వ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.3,500 కోట్ల వడ్డీని ఎగ్గొట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీని చెల్లిస్తుందని మంత్రి తెలిపారు.
News March 27, 2025
పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర: ఎస్పీ

ప్రజలు శాంతియుత జీవనంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెనిద్ర చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్‌లో ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు.
News March 27, 2025
అట్లీతో సినిమా…సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇదిగో!

అట్లీ డైరెక్షన్‌లో మూవీ చేసే అవకాశాలు దాదాపు లేనట్లేనని సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ఈ చిత్ర పనులు ప్రారంభించినప్పుడు ఎలాగైనా పూర్తి చేయాలని భావించాం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరిదిద్దడానికి ప్రయత్నించాం కానీ ఇది ముందుకు సాగటం లేదని తెలిపారు. సికిందర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో సల్మాన్ ఈ విషయాలు పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా అట్లీ-సల్మాన్ చిత్రం ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.