News November 7, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటలు  

image

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. కాగా బుధవారం శ్రీవారిని 66,163 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,299 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.86 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

Similar News

News December 13, 2024

CGHS వెల్ నెస్ సెంటర్ తక్షణమే ప్రారంభించాలి: తిరుపతి ఎంపీ

image

తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ తక్షణమే ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో కోరారు. దాని ప్రారంభానికి నిర్ణయం ప్రకటించి సంవత్సరం కావస్తున్నా.. నియామక అనుమతుల జాప్యంతో ఇంతవరకు ప్రారంభం కాలేదని  చెప్పారు. సెంటర్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య సేవలు పొందటంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

News December 13, 2024

చిత్తూరు రైతులకు ఇది తెలుసా?

image

మామిడి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని చిత్తూరు జిల్లాలో ఎంతమందికి తెలుసు? ఎకరాకు రూ.1750 ప్రీమియం చెల్లిస్తే.. ఎకరాకు రూ.35 వేలు చొప్పున ప్రధానమంత్రి పసల్ బీమా యోజన కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారు. డిసెంబర్ 15 నుంచి మే 31 మధ్యలో గాలులు, అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బి పత్రాలతో 15వ తేదీలోగా మీ సేవలో వివరాలు నమోదు చేసుకోవాలి.

News December 13, 2024

చిత్తూరు జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ప్రకటించారు. ప్రతి ఒక్క స్కూల్ ఈ నింబధన పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు నిన్ననే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.