News February 15, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

image

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 64,527 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,129 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుని హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ శనివారం వెల్లడించింది.

Similar News

News December 1, 2025

నేవీ అధికారి భార్యను రైలు నుంచి తోసేసిన TTE!

image

యూపీలో నేవీ అధికారి భార్య మృతి కేసులో రైల్వే టీటీఈపై కేసు నమోదైంది. నవంబర్ 26న వైద్యం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఆర్తి(30) పొరపాటున మరో ట్రైన్ ఎక్కారు. టికెట్ విషయమై ఆర్తికి TTEతో వివాదం తలెత్తగా లగేజ్‌తో పాటు ఆమెను బయటకు తోసేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయిందన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు GRP అధికారులు తెలిపారు.

News December 1, 2025

రూ.73 లక్షలకు బంగారిగడ్డ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

image

నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సర్పంచ్ అభ్యర్థిగా 11 మంది నామినేషన్ వేశారు. ఆ తర్వాత గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి వేలంపాట వేయడంతో రూ.73 లక్షలకు మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి దక్కించుకున్నట్లుగా తెలిసింది. ఏకగ్రీవం విషయమై అధికారుల నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

News December 1, 2025

అంకన్నగూడెం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం..!

image

ములుగు మండలంలోని ఆదర్శ గ్రామ పంచాయతీ అంకన్నగూడెం పాలకవర్గం ఏకగ్రీవమైంది. ఈ గ్రామానికి రిజర్వేషన్ ఎస్టీ జనరల్ కేటాయించగా.. సర్పంచ్‌గా కొట్టెం రాజు, ఉప సర్పంచ్‌గా అల్లెం నాగయ్యను ఎన్నుకుంటూ గ్రామస్థులు తీర్మానించారు. ఆరుగురు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. <<18420628>>1972లో పంచాయతీ ఆవిర్భావం నుంచి ఏకగ్రీవం <<>>చేసుకుంటున్న గ్రామస్థులు అదే ఆనవాయితీని కొనసాగించారు. మిగతా పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారు.