News March 29, 2025
శ్రీవారి సేవలో శాసనమండలి ఛైర్మన్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, సిపాయి సుబ్రమణ్యంలతో కలిసి రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి దర్శించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించి, ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News April 3, 2025
వనపర్తి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు “30 పోలీస్ ఆక్ట్” అమల్లో ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
News April 3, 2025
ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనల ముగిశాయి. హిమాచల్ ఎమ్మెల్యే రాణా అనర్హత కేసు విషయాన్ని SC ప్రస్తావించగా అది పూర్తిగా విభిన్నమని ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. మరోవైపు సుప్రీంకోర్టుకు వచ్చాక న్యాయవాదుల తీరు మారిపోతోందని జస్టిస్ బీఆర్ వ్యాఖ్యానించారు.
News April 3, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో గురువారం అత్యధికంగా నిజాంసాగర్, పిట్లం మండలాలలో 37.5, బాన్సువాడ, బిచ్కుంద మండలాలలో 37.4, మద్నూర్ 37.3, నసుల్లాబాద్ 37.0, కామారెడ్డి, బిక్కనూర్, రామారెడ్డి, దోమకొండ మండలాలలో 36.0 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా బిబిపేట మండలంలో 33.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి….