News January 24, 2025

శ్రీశైలంలో అంకాలమ్మ తల్లికి విశేష పూజలు

image

లోక కల్యాణార్థం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ వారికి శుక్రవారం అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. సర్కారిసేవగా ఈ విశేష పూజలు జరిపించబడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మకు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అభిషేకం పూజలను నిర్వహించారు.

Similar News

News November 23, 2025

ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు

image

AP: ఇంధన సామర్థ్యం/పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెన్‌కో MD నాగలక్ష్మి వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీకి అర్హులని తెలిపారు. ‘తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 30-120సెకన్ల నిడివితో MP4 ఫార్మాట్‌లో వీడియోలు రూపొందించి DEC 10లోగా పంపాలి. తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి ₹20K, ₹10K, ₹5K బహుమతులు ఇస్తాం. వివరాలకు 0866-2457620 నంబరులో సంప్రదించాలి’ అని చెప్పారు.

News November 23, 2025

సత్యవేడు: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIITలో 2026 సంవత్సరానికి సంబంధించి MS (Research)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. 3 విభాగాలలో కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://iiits.ac.in/admissions/ms-research-programme/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News November 23, 2025

హనుమకొండ: బహుమతులను అందజేసిన మంత్రి, ఎమ్మెల్యేలు

image

11వ తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025-26 పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.