News March 1, 2025
శ్రీశైలంలో అలరించిన మహిళల కోలాటం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో శుక్రవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మహిళల కోలాటం భక్తులను అలరించింది. ముందుగా నిత్య కల్యాణ మండపంలో సదస్యం – నాగవల్లి కార్యక్రమాలు జరిపించి సదస్యం జరిపించారు. కార్యక్రమంలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లను స్తుతిస్తారు. ఆగమ శాస్త్రం సంప్రదాయం మేరకు అమ్మవారికి మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు.
Similar News
News November 15, 2025
PGIMERలో 151 పోస్టులు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (<
News November 15, 2025
హనుమాన్ చాలీసా భావం – 10

భీమరూప ధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే ||
ఆంజనేయుడు భయంకరమైన, భీకరమైన రూపాన్ని ధరించి, శక్తివంతమైన రాక్షసులను సంహరించాడు. తన సొంత ప్రయోజనం కోసం కాకుండా, శ్రీ రామచంద్రుడను నమ్మి ఆయన ముఖ్య కార్యాలను విజయవంతంగా పూర్తి చేశాడు. ఎంతటి శక్తి ఉన్నా.. ఆ బలాన్ని ఉత్తమ ధర్మాన్ని నిలబెట్టడానికి, దైవ కార్యాలను నెరవేర్చడానికి మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే మన జీవిత లక్ష్యం నెరవేరుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 15, 2025
ఇక గాంధీ భవన్ చూపు.. గ్రేటర్ HYD వైపు..!

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్లో ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఈ టెంపోను ఇలాగే కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఈ విజయం స్ఫూర్తితో జీహెచ్ఎంసీలో పాగా వేయాలని గాంధీభవన్ ప్లాన్ వేస్తోంది. ఈ మేరకు నాయకులు కేడర్కు దిశానిర్దేశం చేయనుంది. గ్రేటర్ HYDలో పక్కాగా ప్లాన్ వేసి వందకు తగ్గకుండా కార్పొరేటర్ సీట్లు సాధించి మేయర్ సీటు పట్టాలని ఆశిస్తోంది.


