News February 21, 2025

శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

image

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. దేవస్థానం ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యాకళారాధన వేదిక, పుష్కరిణి ప్రాంగణంలోని బ్రామరీకళావేదిక, శివదీక్షాశిబిరాల ప్రాంగ ణంలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కూచిపూడి నృత్యప్రదర్శన, భరతనాట్యం, మహాశివరాత్రి వైభవం ప్రవచనం, వేణుగానం తదితర కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి.

Similar News

News March 24, 2025

పీజీఆర్ఎస్‌కు 203 దరఖాస్తులు వచ్చాయి: కలెక్టర్ 

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలో దాదాపు 30 వేల అర్జీలు పరిష్కరించామన్నారు. సోమవారం పీజీఆర్ఎస్‌కు 203 దరఖాస్తులు వచ్చాయన్నారు.

News March 24, 2025

వరంగల్: డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల జిల్లా నిరోధక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణా వినియోగంపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. వీటి రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హైవేల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు.

News March 24, 2025

21 బంతుల్లో హాఫ్ సెంచరీ

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ వీర విహారం చేశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదారు. మరోవైపు పూరన్ సైతం ధాటిగా ఆడుతున్నారు. 7 ఓవర్లలో స్కోరు 89/1.

error: Content is protected !!