News January 8, 2025
శ్రీశైలంలో ఇష్ట కామేశ్వరి అమ్మవారి గురించి తెలుసా?
భారతదేశంలో శ్రీశైలంలో మాత్రమే ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇష్ట కామేశ్వరి అమ్మవారు. పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే కొలవబడే అమ్మవారు ప్రస్తుతం సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ ఆలయం ప్రసిద్ధి. ఎంత గొప్ప కోరికైనా ఇక్కడి అమ్మవారికి చెప్పుకుంటే కచ్చితంగా జరిగి తీరుతుందనేది భక్తుల నమ్మకం. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఇష్ట కామేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.
Similar News
News January 10, 2025
20 నుంచి జిల్లాలో రీ సర్వే ప్రారంభం: జేసీ
కర్నూలు జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు కింద జిల్లాలో సర్వే కార్యక్రమం ప్రారంభం కానున్నదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ.నవ్య పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు కింద రీ సర్వేపై జిల్లాలోని RSDTలు, మండల సర్వేయర్లకు, డిప్యూటీ తహశీల్దార్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
News January 9, 2025
శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు
23 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. రూ.3,39,61,457 నగదుతో పాటు 139 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారం, 5 కేజీల 400 గ్రాముల వెండి, పలు దేశాల విదేశీ కరెన్సీ ఆదాయంగా చేకూరింది. పటిష్ఠమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్యన లెక్కింపును చేపట్టామని ఈవో ఎం.శ్రీనివాసరావు, డిప్యూటీ ఈవో రమణమ్మ తెలిపారు.
News January 9, 2025
కర్నూలు: పోక్సో కేసులో మూడేళ్లు జైలు శిక్ష
పదేళ్ల బాలికకు అసభ్యకర ఫొటోలు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కర్నూలు బుధవారపేటకు చెందిన బొగ్గుల రాజేశ్కు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు మూడేళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2021 జూన్లో కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి పై విధంగా తీర్పునిచ్చారు.