News April 9, 2024
శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు 740 మంది పోలీసులు
శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు విధులకు సుమారు 740 మంది పోలీసులను నియమించినట్లు ఎస్పీ రఘువీరా రెడ్డి తెలిపారు. వీరిలో డీఎస్పీలు 9 మంది, సీఐలు 30, ఎస్సైలు 62, ఏఎస్సైలు 186, కానిస్టేబుళ్లు 247, మహిళా కానిస్టేబుళ్లు 44, హోమ్ గార్డులు 171 మందిని విధులకు నియమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపేలా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News November 6, 2024
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ కీలక వ్యాఖ్యలు!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు MLA డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో వ్యక్తిగత అజెండాలకు తావులేదని, మన ఐక్యతకు భంగం కలిగించే శక్తులను తరిమికొడదామని కూటమి నేతలకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టి, పార్టీ మార్గదర్శకాలను గౌరవిస్తూ ముందుకు సాగడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలు మన నాయకత్వాన్ని, మన కృషిని నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.
News November 6, 2024
నంద్యాల IIIT విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నంద్యాలకు చెందిన ఓ యువతి శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం (ట్రిపుల్ ఐటీ)లో ఆత్మహత్యాయత్నం చేసింది. విష ద్రావణం తాగిన విద్యార్థిని వసతి గృహం సిబ్బంది గుర్తించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ యువతి ప్రస్తుతం ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ మొదటి ఏడాది చదువుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 6, 2024
నల్లమలలో మైమర్చిపోయేలా రైలు ప్రయాణం
నంద్యాల-గిద్దలూరు సమీపంలో గల నల్లమల అటవీ ప్రాంతంలోని రైలు మార్గం ప్రయాణికులు మైమరిచిపోయేలా ఉంటుంది. ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురియడంతో రైలు మార్గానికి ఇరువైపులా నల్లమల పచ్చటి అందాలతో కనువిందు చేస్తోంది. ఈ అపురూప దృశ్యాన్ని నల్లమల కొండల నుంచి చూస్తే ఎంతో ఆకట్టుకుంటోంది. బ్రిటిష్ కాలం నుంచి ఈ రైలు మార్గం అందుబాటులో ఉంది.