News March 25, 2025

శ్రీశైలంలో ఎటు చూసినా భక్తుల వాహనాలే!

image

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రానికి లక్షలాది మంది కర్ణాటక భక్తులు తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు వాహనాలతో పాటు పాదయాత్ర ద్వారా ఆలయానికి చేరుకుంటున్నారు. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కర్ణాటక భక్తులకు చెందిన వాహనాలు దర్శనమిస్తున్నాయి. పార్కింగ్ ప్రదేశాలతో పాటు రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలుపుకుంటున్నారు.

Similar News

News January 5, 2026

ఎండోమెట్రియోసిస్ ఉంటే పిల్లలు పుట్టరా?

image

మహిళల్లో ఎండోమెట్రియల్ లైనింగ్ మందంగా ఉంటే నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, నొప్పి, స్పాటింగ్ వంటివి ఉంటాయి. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీని తీవ్రతను బట్టి గర్భధారణ సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారిలో అబార్షన్, ప్రీటర్మ్ డెలివరీ వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ✍️ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.

News January 5, 2026

WGL: మండలాల్లో ప్రజావాణికి పాతర..!

image

ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణికి గ్రామాల నుంచి వినతులు ఎక్కువగా వస్తున్నాయని గత ప్రభుత్వం మండలాల్లోనూ ప్రజావాణిని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజావాణిని చేపట్టగా ఉమ్మడి WGL జిల్లాలోని పలు చోట్ల మూన్నాళ్ల ముచ్చటగా మారింది. బాధితులు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లకు అనేక వ్యయ ప్రయాసాలకోర్చి వెళ్లాల్సి వస్తోంది.

News January 5, 2026

ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స

image

ఎండోమెట్రియోసిస్‌ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా పెల్విక్‌ నొప్పి, పీరియడ్స్‌లో నొప్పి, హెవీ బ్లీడింగ్, స్పాటింగ్, ప్రేగు కదలిక నొప్పి, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, సంతానలేమి ఉంటాయి. హార్మోన్‌ థెరపీ తీసుకోవడం కొన్నిసార్లు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇవి ఎండోమెట్రియోసిస్‌ కణాల వృద్ధిని నియంత్రణలో ఉంచుతాయి. కొందరిలో లాప్రోస్కోపిక్‌ సర్జరీ అవసరం పడుతుందంటున్నారు నిపుణులు.