News February 24, 2025

శ్రీశైలంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా పాతాళ గంగ ఘాట్‌కు చేరుకొని అక్కడ ఏర్పాట్లను భక్తులను అడిగి తెలుసుకున్నారు. పాతాళ గంగ వద్ద పుణ్య స్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News November 5, 2025

కోర్టుకు పాస్‌పోర్ట్ అప్పగించిన రాజంపేట MP

image

ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటన ముగియడంతో ఆయన ఇండియాకు వచ్చారు. మద్యం కేసులో ఆయనకు కండిషనల్ బెయిల్ వచ్చింది. పాస్‌పోర్ట్‌ను కోర్టులో సమర్పించాలని అప్పట్లోనే ఆదేశించింది. అమెరికా వెళ్లే ముందు ఆయన పాస్‌పోర్టు తీసుకోగా.. ఇవాళ కోర్టులో తిరిగి సమర్పించారు.

News November 5, 2025

ఆరిలోవలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సింహాచలం నుంచి బైక్ పై ఆరిలోవ వైపు వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు పై ఉన్న ఇద్దరు యువకులు గాయపడడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. మృతుడు గురుద్వార్‌కి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు.

News November 5, 2025

నవంబర్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు!

image

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఉభయ సభలు ఈనెల 24 లేదా 25 నుంచి సమావేశం అవుతాయని పేర్కొన్నాయి. డిసెంబర్ 19 వరకు ఇవి కొనసాగుతాయని చెప్పాయి. కాగా EC చేపట్టిన దేశవ్యాప్త SIRను వ్యతిరేకిస్తూ ఓట్ చోరీ అంటూ విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు దీనిపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. US టారిఫ్స్‌పైనా ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.