News September 18, 2024

శ్రీశైలంలో నీటిమట్టం 881.7 అడుగులు

image

ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 40,949 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 37,116 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,755 మొత్తం 67,871 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయంలో మంగళవారం నీటిమట్టం 881.7 అడుగుల వద్ద 197.4616 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

Similar News

News October 14, 2025

MBNR: పోలీస్ ఫ్లాగ్ డే.. ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: SP

image

పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని నిర్వహించే ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలలో పాల్గొనాలని ఎస్పీ డి.జానకి యువత, విద్యార్థులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు పిలుపునిచ్చారు. పోలీస్ సేవలు, త్యాగాలు, సమాజ రక్షణలో పోలీసులు పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిబింబించేలా తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆమె కోరారు. ఈ నెల 23వ తేదీ లోగా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో తమ రచనలు/చిత్రాలను సమర్పించాలని ఎస్పీ సూచించారు.

News October 14, 2025

MBNR: తుమ్మల క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మానవత్వం ఉందా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కమ్మ సామాజికవర్గం ఓట్లతోనే తుమ్మల మంత్రి అయ్యారన్నారు. మాగంటి సునీత ఎమ్మెల్యే భర్త మరణిస్తే వచ్చిన ఉపఎన్నికలో ఆమె బిడ్డలు, కొడుకు ప్రచారం చేయడంపై అభ్యంతరం ఏంటని నిలదీశారు. తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

News October 14, 2025

MBNR: SP వీడియో కాన్ఫరెన్స్.. కీలక సూచనలు

image

MBNRలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డీ.జానకి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
✒ పెండింగ్ FIRలు, ఛార్జ్‌షీట్లు పూర్తి చేయాలి
✒ NBW వారెంట్లు.. ప్రతి వారానికి నివేదిక సమర్పించాలి
✒ డ్రంక్ అండ్ డ్రైవ్.. ప్రత్యేక నిఘా పెట్టాలి
✒ మిస్సింగ్ వ్యక్తులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
✒ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి