News March 27, 2025
శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు

శ్రీశైలం మల్లన్న ఆలయం ఉగాది ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 31 వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి విశేషార్చనలు, అమ్మవారికి వాహన సేవలు జరగనున్నాయి. 30వ తేదీ ఉదయం విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఉంటుంది. అదేరోజు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
Similar News
News November 14, 2025
నవంబర్ 14: చరిత్రలో ఈ రోజు

⋆ 1889: భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జననం (ఫొటోలో)
⋆ 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం
⋆ 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం
⋆ జాతీయ బాలల దినోత్సవం
⋆ తెలంగాణ నీటిపారుదల దినోత్సవం
⋆ ప్రపంచ మధుమేహ దినోత్సవం
News November 14, 2025
శ్రీశైలంలో నేడు కోటి దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి!

శ్రీశైలం క్షేత్రంలో నేడు సాయంత్రం కోటి దీపోత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. ఆలయం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఇందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. కార్తీక మాసం సందర్భంగా దేవస్థానం ప్రతిష్టాత్మకంగా మొదటిసారి ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆలయ ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
News November 14, 2025
జక్కన్న.. ఏం ప్లాన్ చేశావయ్యా?

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా SSMB29 నుంచి ఇవాళ బిగ్ అప్డేట్ రానుంది. దీని కోసం మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. కాగా ఈవెంట్కు వ్యాఖ్యాతలుగా యాంకర్ సుమతో పాటు యూట్యూబర్ ఆశిష్ వ్యవహరిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో వారితో రాజమౌళి డిస్కషన్స్ చేస్తున్న ఫొటోలు వైరలవ్వగా ‘ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న’ అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.


