News February 21, 2025
శ్రీశైలంలో నేడు హంస వాహనంపై ఆదిదంపతుల విహారం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు నేడు హంస వాహనంపై విహరించనున్నారు.పూజా కార్యక్రమాలు ఇలా.. ◆ ఉదయం 8 గంటలకుచండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు◆ ఉదయం 9 గంటలకురుద్రహోమం,చండీహోమం◆ సాయంత్రం 5.30 గంటలకుసాయంకాలార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, సాయంకాల హోమాలు.
Similar News
News March 23, 2025
ఐనవోలులో భారీ పోలీస్ బందోబస్తు

పెద్ద పట్నం సందర్భంగా ఐనవోలు మల్లికార్జున ఆలయంలో ఆదివారం జరిగే జాతరను సజావుగా నిర్వహించేందుకు పర్వతగిరి సీఐ రాజగోపాల్ పర్యవేక్షణలో ఐనవోలు ఎస్ఐ శ్రీనివాస్ స్థానిక పోలీసులు, ప్రత్యేక పోలీసులతో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్, చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పెద్ద పట్నం జాతరకు హాజరవుతారు.
News March 23, 2025
సిరిసిల్ల: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
News March 23, 2025
BRS రజతోత్సవ వేడుకలపై నేడు కేటీఆర్ సమీక్ష

TG: కరీంనగర్‌లో నేడు జరగనున్న BRS రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల నుంచి ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి రానున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వచ్చే నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై సమీక్షించడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.