News March 27, 2025
శ్రీశైలంలో భారీ పోలీస్ బందోబస్తు: ఎస్పీ

శ్రీశైలంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, అడిషనల్ డీజీపీ మధుసూదన్ రెడ్డి, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలతో పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సిబ్బంది అందరూ అంకితభావంతో పని చేయాలన్నారు.
Similar News
News December 9, 2025
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ శబరీష్

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు సహా మొత్తం 1000 మంది సిబ్బంది అవిశ్రాంతంగా పని చేయాలని ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
ఎన్టీఆర్ జిల్లా డీఈఓగా ఎల్. చంద్రకళ

విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ డీఈఓల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా డీఈఓగా ఎల్. చంద్రకళను నియమించింది. అలాగే కృష్ణా జిల్లా డీఈఓగా యు.వి. సుబ్బారావును బదిలీ చేశారు. పరిపాలనా సమర్థతను పెంచడం, విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొత్త డీఈఓలు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
News December 9, 2025
ఖమ్మం: పోలింగ్ సిబ్బంది 3వ దశ ర్యాండమైజేషన్ పూర్తి

జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బంది మూడవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామా రావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో మంగళవారం పూర్తి చేశారు. 192 గ్రామ పంచాయతీలు, 1,740 వార్డులకు గాను 1,582 బృందాలను ఏర్పాటు చేసి, 20 మంది సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచారు. 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఓపీలను మండలాలవారీగా కేంద్రాలకు కేటాయించారు.


